గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి వీకర్ సెక్షన్, రాజీవ్ నగర్ కాలనీల్లో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి శనివారం పర్యటించారు. స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ, మంజీరా తాగునీటి పైప్లైన్ సమస్యలను పరిశీలించారు. అనంతరం స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.