శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ చిత్రపురి కాలనీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో ఫార్మసీని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఓఓలు రామ్ మోహన్, ప్రసాద్, రెడ్డప్ప రెడ్డి, మేనేజర్లు కృష్ణ, నాగరాజు, డీజీఎంలు రామ్ కుమార్, సుబ్బారెడ్డి, గంగిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దార్గుపల్లి నరేష్, ఫార్మసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
