జలమండలి‌ పురస్కారం‌ అందుకున్న మోటూరి నారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: జల వనరుల సంరక్షణ కోసం భగీరథడిలా కృషి చేయాలని కవితాగానంతో సాహిత్య అభిమానులను ఆకట్టుకున్న వర్ధమాన కవి సీనియర్ జర్నలిస్టు మోటూరి నారాయణరావు ఘన సన్మానం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం జలమండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవంలో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన మోటూరి నారాయణ రావు పాల్గొని నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, నీటి ఆవశ్యకత పై, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు అందిస్తూ కవితా గానం చేసి సభికుల్ని ఆకట్టుకున్నారు. జల మండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, గాంధీ జ్ఞాన్ సంస్థ అధ్యక్షుడు డా. గున్న రాజేందర్ రెడ్డి, జలమండలి జనరల్ మేనేజర్ ఎస్ హరి శంకర్, కవి బండికారి బాలాజీ, ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ, మూర్తి శ్రీదేవి, గరిమెళ్ళ తులసీ వెంకట రమణా చార్యులు, వేదార్థం మధుసూదన్ శర్మ, కొండా మోహన్, రామకృష్ణ చంద్రమౌళి, పోలయ్య కవి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు‌.

సత్కారం అందుకున్న మోటూరి నారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here