కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ- అనాథాశ్రమంలో మాతృ దినోత్సవం- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి బిడ్డల జీవితానికి బంగారు బాటలు వేస్తూ, నిస్వార్థంగా తన సంతానం అభివృద్ధిని కాంక్షించే‌ ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో ఒక్క అమ్మేనని, తాను పస్తులుండైనా సరే తన సంతానానికి ఆకలి తీర్చేందుకు నిర్విరామంగా కృషి చేసే మహోన్నతురాలు మాతృమూర్తి అని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. మియాపూర్ లోని గ్రేస్ అనాథ ఆశ్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆనాథాశ్రమంలోని వృద్దులందరికీ భోజన సదుపాయం తో పాటు బిస్కెట్స్, బాత్ సొప్స్, వాషింగ్ సోప్ లు, పేస్ట్, బ్రష్ షాంపోస్ అరటి పళ్ళు అందజేశారు.

అనాథాశ్రమంలో వృద్ధులకు కిట్స్ ను అందజేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదని, దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించారని అన్నారు. అమ్మంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం, ఓ అమృత తత్వం అమ్మే ఎవరికైనా తొలి గురువు అని తెలిపారు. రెక్కలు ముక్కలు చేసుకుని తన సంతానాన్ని పెద్ద చేస్తుందని, బుడి బుడి అడుగుల నుంచి నడకను నేర్పుతూ భవితను నిర్దేశిస్తుందన్నారు. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుందని, అమ్మే ప్రత్యక్ష దైవం అని చెప్పారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులను వృద్దాప్యంలో పుత్రులు, పౌత్రులు స్వార్థ చింతనతో వారిని నిర్లక్ష్యానికి గురి చేస్తూ వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్దాప్యంలో వారి పట్ల ప్రేమానురాగాలు చూపించి కంటికి రెప్పలా చూసుకుంటూ కడవరకు కడతేర్చాల్సిన సామాజిక బాధ్యత పుత్రులు పౌత్రులపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ‌మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కౌండిన్య శ్రీ నండూరి వేంకటేశ్వరశ్వర రాజు, విష్ణు ప్రసాద్, శివరాం కృష్ణ, జనార్ధన్, ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గ్రేస్ అనాథాశ్రమంలో వృద్ధులకు భోజన సౌకర్యం కల్పించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here