నాలా విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, రాబోయే వర్షాకాలం దృష్ట్యా నాలా విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ లో నాల విస్తరణ లో భాగంగా సత్యనారాయణ ఎనక్లేవ్ వద్ద రూ. కోటి 50 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. నాలా నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, పనులలో వేగం పెంచాలని సూచించారు. నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

నాలా విస్తరణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here