శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ముజఫర్ అహమ్మద్ నగర్ యం సి పి ఐ (యు)పార్టీ కార్యాలయం లో మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జలియన్ వాలాబాగ్ అమరవీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బ్రిటిషు పాలకుల పాలనను మైమరిపిస్తుందని జనరల్ డయ్యర్ తరహాలో నియంత్రత్వాన్ని ప్రదర్శిస్తుందని భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా ఉద్యమాలతోనే కాపాడుకోగలమని యం సిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అన్నారు. కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ (సిసిసి) పిలుపులో భాగంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా మియాపూర్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యురాలు జి శివాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13వ తేదీన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, దేశ స్వాతంత్రోద్యమ కార్యకర్తలు సైఫుద్దీన్ స్విచ్లు, సత్యపాల్ అరెస్టును నిరసిస్తూ నాటి బ్రిటిష్ ఇండియా పంజాబ్ లోని అమృత్ సర్‌లో జలియన్వాలాబాగ్ పార్కులో పంజాబు ప్రజల నూతన సంవత్సరం సందర్భంగా అంటే బైషాఖి ఉత్సవాల సందర్భంగా జలియన్ వాలా బాగ్ పార్క్ లో సమావేశమైన ప్రజలపై నాటి బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన గుర్కా, సిక్కు పదాతి దళ రెజిమెంట్లతో ప్రజలను చుట్టుముట్టిన డయ్యర్ సైన్యం నిరాయుదులైన ప్రజలపై విచ్చలవిడిగా తమ దగ్గర ఉన్న మందు గుండు సామాగ్రి పూర్తి అయ్యేంతవరకు కాల్పులు జరిపించాడని, పార్క్ లో ఉన్న బావిలో ఆత్మరక్షణకు ప్రజలు దూకి, కాల్పుల్లో వందలాది మంది ప్రజలు మరణించారని, దాదాపు 1200 మందికి పైగా గాయపడ్డారని వారి పోరాట స్ఫూర్తి ఎంతో చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డి డబ్ల్యు మహిళా సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు యం డి సుల్తానా బేగం, కోడిపాక రాజు, ఎండి అమీనా బేగం తదితరులు పాల్గొన్నారు.