శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, అన్నమ స్వరార్చనలో భాగంగా, తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమయ్య అష్టోత్తరంతో ప్రారంభించగా, ఏ.బి.వి. విద్యార్థులచే గురు స్తుతి (అన్నమ గాయత్రి) పాడగా, అనంతరం ప్రముఖ కథక్ ప్రావీణ్యులు డా. దివ్య సల్లా సింగ్, కుమారి లక్ష్మి విశ్వనాధన్, వారి బృందం సుమన్ గిద్వాని, మాన్సి హిందోచ సంయుక్తంగా వందన త్రయి, శివ స్తుతి, మధురాష్టకం, దర్బారి తారానా, నటభైరవ తారానా అనే సంకీర్తనలకు అద్భుతమైన కథక్ నృత్య ప్రదర్శన అందించారు. అనంతరం కళాకారులకు, డా శోభా రాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి ఇచ్చి వారి తీర్థ ప్రసాదాలతో అన్నమ స్వరార్చన దిగ్విజయంగా ముగిసింది.