నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ కూచిపూడి నృత్య నిలయం నాట్య గురువర్యులు శ్రీ భాగవతుల సేతురాం గారి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.పుష్పాంజలి , అంబస్తవం, భో శంభో, స్మర సుందరాంగుని , హంసధ్వని జతిస్వరం, దశావతార శబ్దం, జయదేవ అష్టపది, అన్నమాచార్య కీర్తన అంశాలను కుమారి శ్రేష్ఠ, శ్రీకృతి, త్రివేణి చౌదరి కళాకారులు పద విన్యాసం తో చక్కని అభినయం తో సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ కూచిపూడి నాట్య గురువర్యులు డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ వనజ ఉదయ్, డాక్టర్ రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొని నృత్య కళాకారులను అభినందించారు. కూచిపూడి నాట్య విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు.