శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): అందరికీ ప్రభుత్వ పథకాలు, విద్యా ఉపాధి, సామాజిక న్యాయం అందించాలని కోరడమే, గావ్ చలో బస్తీ చలో ముఖ్య ఉద్దేశం అని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాసుపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, స్మశాన వాటికలు, చెరువులు, కుంటలు ,దేవాలయాల అభివృద్ధికి పాటుపడుతూ స్థానికంగా బస్తీలో ఉన్న సమస్యలపై దృష్టి సాధించి సమస్యలు పరిష్కరించాలని బీజేపీ శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు గావ్ చలో బస్తి చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, బంజారా బస్తి, రాజీవ్ నగర్ కాలనీలలో వారు పర్యటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జిలు నరసింహ చారి, అజిత్ సేనాపతి, ఆంజనేయులు సాగర్, అరవింద్, పద్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ సూచన మేరకు అంజయ్య నగర్ లో ఉన్న స్మశాన వాటికను సందర్శించి ఈ స్మశాన వాటిక ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులే సమాధానం చెప్పాలని కోరారు. చెత్తాచెదారం, డ్రైనేజీ దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తూ వెంటనే స్థానిక జోనల్ కమిషనర్ తగు చర్య తీసుకోవాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా బూత్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇంటిపై జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాల శుద్ధి, అంగన్వాడి సెంటర్ల సందర్శించి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అనునిత్యం ప్రజల్లో ఉంటూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన విధివిధానాలను , కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ స్థానిక సమస్యలపై అనునిత్యం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, భాస్కర్ రెడ్డి, రవి నాయక్, మన్యంకొండ సాగర్, రాజేందర్, సంతోష్, అశోక్, చందు, ఆత్మారాం, ఓం ప్రకాష్, బన్సీలాల్, కిషన్ జి ,రేఖ , సరోజా రెడ్డి, రెడ్డమ్మ పాల్గొన్నారు.