నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని భూలక్ష్మమ్మ ఆలయం ఆవరణలో బుధవారం ప్రారంభమైన కరోనా మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలనే సదుద్దేశంతో మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిందని బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సెంటర్ డాక్టర్ వినయ్ తో పాటు కె. వెంకటేశ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.