ఈఈగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్-జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అభినందనలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో డీఈ గా పనిచేసిన శ్రీనివాస్ శేరిలింగంపల్లి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)గా పదోన్నతి ‌పొంది బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ వెంకన్న, తమ సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్ల సహకారంతో మరింత ఉత్సాహంగా పనిచేసి అభివృద్ధిలో ముందుంటామని ఈఈ శ్రీనివాస్ అన్నారు. సర్కిల్ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు ఏఈల అవసరం ఉందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి నియామకం చేపట్టుకుని ఇంజనీరింగ్ విభాగంలో పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓర్సు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదవి భాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వయిజర్ రామచందర్,‌ నాయకులు మల్లికార్జున్, శివముదిరాజ్. ఆర్. వెంకటేష్. సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈఈగా పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ కు శుభాకాంక్షలు ‌తెలుపుతున్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here