నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆంద్ర నాట్యం, పేరిణి, నృత్యాలతో పలువురు చిన్నారులు ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల నృత్యాలను అభినందించారు. మంత్రి మాట్లాడుతూ మరుగున పడుతున్న ఆంద్ర నాట్యాన్ని ఆ కాలంలో నటరాజ రామకృష్ణ ఎందరో శిష్యులను తయారుచేశారన్నారు. ఆ శిష్యులు ఈ కాలంలో గురువులుగా మారి ఎంతో మంది చిన్నారులకు నాట్యం ను నేర్పిస్తూ ఆంద్ర నాట్యంతో అలరింపజేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఎంతో మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తున్న హైదరాబాద్ కు చెందిన నటరాజ రామకృష్ణ శిష్యుడు అయిన బండి పేరణీ కుమార్ ను ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. మన భాష సాంస్కృతి , నాట్య కళలకు మన హైదరాబాద్ ప్రసిద్ధి గాంచిందన్నారు. నాట్య కళ అంటే ఒక కళలలకే పరిమితం కాకుండా మనిషికి ఆహ్లాదం అందిస్తాయని అన్నారు. చిన్నారి పండ్రప్రగడ వైష్ణవి మిత్ర బృందం చేసిన వినవే సుగుణాన్నిత ఆధ్యాత్మ రామాయణ కీర్తన చూసి అభినందించారు.