శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు, అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, కావూరి హిల్స్ లలో నూతన సీసీ రోడ్ల పనులకు స్థానిక నాయకులతో కలసి పిఏసీ చైర్మన్, శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలసి శంకుస్థాపన చేశారు. శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు లో 39 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, అంజయ్య నగర్ కాలనీలో 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, సిద్దిక్ నగర్ కాలనీలో 38 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, కావూరి హిల్స్ కాలనీలో 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయుట జరిగిందని ఈ సందర్బంగా తెలియజేశారు. మౌలిక వసతులు అనేవి కాలనీలు, బస్తీల అభివృద్ధికి సూచికను తెలియజేస్తాయని అన్నారు, ప్రజలకు నిత్యం అవసరం అయినా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, కరెంటు వంటి కనీస నిత్యావసర మౌలిక వసతులు ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, షేక్ చాంద్ పాషా, నరసింహ సాగర్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, ఊట్ల దశరథ్, రాజు యాదవ్, కే. శివ కుమార్, వెంకట్ రెడ్డి, జే. బలరాం యాదవ్, కరీం లాలా, తిరుపతి యాదవ్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, డా. మల్లేష్, ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, మంగళరాపు తిరుపతి, రజనీకాంత్, రవి శంకర్ నాయక్, బసవ రాజు, నందు, బుడుగు తిరుపతి రెడ్డి, లక్ష్మి బాయ్, సాగర్ చౌదరి, వెంకటేష్, కుమార్, చారీ, విజయ్, వినోద్ యాదవ్, కృపాకర్, సాయిబాబా, వసీం తదితరులు పాల్గొన్నారు.