సంక్షేమమే పరమావధిగా, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ 3 కోట్ల 58 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణము పనులకు, పలు అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, గ‌చ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శరవేగంగా విస్తరిస్తున్న గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలుపు తున్నామని అన్నారు. మన నగరాభివృద్ధి మన చేతుల్లోనే ఉందని, రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులు కేటాయించి, గచ్చిబౌలి డివిజన్‌లోని అన్ని ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా గత నాలుగు సంవత్సరాలుగా కోట్లాది రూపాయల నిధులతో గచ్చిబౌలి డివిజన్‌ను మోడ్రన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దామని, రానున్న రోజుల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శవంతమైన డివిజన్‌గా మారేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానులు, కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here