నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని ఓ చెరువులో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే మియాపూర్ జనప్రియ వెస్ట్‌సిటీలో పాఠశాల విద్య అసిస్టెంట్ డైరెక్టర్(రిటైర్డ్) శ్రీనివాస్‌రావు రమాదేవి దంపతుల నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు సాయి ప్రవీణ్‌కుమార్ అమెరికాలోని ఆస్టిన్‌లో నివాసం ఉంటు స్థానికంగా అమెజాన్ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా విదులు నిర్వహిస్తున్నాడు. కాగా గురువారం సాయిప్రవీణ్ స్నేహితులతో కలసి స్థానికంగా ఒక చెరువు సందర్శనకు వెళ్లాడు. అక్కడ పెడల్ బోటింగ్‌లో పాల్గొన్న సాయిప్రవీణ్ అదృశ్యమయ్యాడు. రెండు రోజులు అనంతరం చెరువులో శవమై తేలాడు. అక్కడి పోలీసుకుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయిప్రవీణ్ మృతి మియాపూర్‌లో విశాద చాయలు అలుముకున్నాయి. అతని పార్ధీవ దేహాన్ని స్వగృహానికి తీసుకువస్తున్నట్టు బంధువులు తెలిపారు.