నమస్తే శేరిలింగంపల్లి: లైసెన్స్ లేని ఓ యువకుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఓ మహిళ గర్భస్త్రావానికి కారణమయ్యాడు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్‌పల్లి ఐడిపియల్‌కు చెందిన అచుబాయి(32) ఎనిమిది నెలల గర్భవతి. ఈ నెల 19వ తేదీన అచుబాయి మదీనాగూడ జిఎస్ఎం మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా, మాల్‌లో గల కెఎఫ్‌సిలో పనిచేసే షేక్ హర్షత్(20) అతివేగంతో నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ అచుబాయిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆమె కడుపుకు తీవ్ర గాయాలవ్వడంతో 20వ తేదీన అబార్షన్ జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. షేక్ హర్షత్‌కు డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకపోవడంతో పోలీసులు సెక్షన్ 304 ( ii) ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.