రూ.1.65 కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సత్యలక్ష్మి నగర్ కాలనీ నుండి గుర్నాథమ్ చెరువు సమీపం మీదుగా బీఎస్ఎన్ఎల్ కల్వర్ట్ వరకు సుమారుగా రూ.1.65 కోట్ల అంచనా వ్యయం తో చేపట్టనున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి కెటిఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వరద నీటి కాలువ పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదన్నారు.

వ‌ర‌ద‌నీటి కాలువ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ త‌దిత‌రులు

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ శ్రీకాంతిని, డీఈ రూప దేవి, ఏఈ లు ధీరజ్, అనురాగ్ , వర్క్ ఇన్‌స్పెక్టర్లు విశ్వనాథ్, జగదీష్, నాయకులు పురుషోత్తం యాదవ్, మోహన్ ముదిరాజ్, ముప్పవరపు గంగాధర్ రావు, మాధవరం గోపాల్ రావు, బి యస్ ఎన్ కిరణ్ యాదవ్, గొపరాజు శ్రీనివాస్, మహేందర్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మహ్మద్ కాజా, శ్రీధర్ ముదిరాజ్ , దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, చిన్న, ప్రభాకర్ ముదిరాజ్, నర్సింగ్ రావు,అశోక్ , విజయ్ ముదిరాజ్, రాజు గౌడ్, ఎల్ రాజు, వెంకటేష్, శివ ముదిరాజ్, జంగం మల్లేష్, నాగరాజు యాదవ్, తిరుపతి నాయక్, కృష్ణ నాయక్, ఎస్టీ సెల్  అధ్యక్షులు స్వామి నాయక్, ప్రణీత్ కుమార్, సుధీర్ కుమార్, రవి, గౌస్, సత్యనారాయణ, మహిళ అధ్యక్షురాలు కలిదిండి రోజా, పి సుప్రజ, లత, రాణి, శ్రీ మహాదేవి, లక్ష్మి ,స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here