బాలాజీ నగర్‌లో మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, మక్త మహబూబ్‌పేట్‌ విలేజ్ లోని సత్యనారాయణ ఎన్ క్లేవ్ కాలనీ లో రూ.30 లక్షల నిధులతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల సమస్య త్వరలో పరిష్కారం కానుందన్నారు. బాలాజీ నగర్, సత్యనారాయణ ఎన్ క్లేవ్ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాత పైప్ లైన్ ద్వారా కలుషిత నీరు వస్తుందని కాలనీ వాసుల కోరిక మేరకు పాత పైప్ లైన్ స్థానం లో కొత్త పైప్ లైన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నాగప్రియ,మేనేజర్లు సాయి చరిత, పరమేశ్వరి, సునీత, నాయకులు పురుషోత్తం యాదవ్, మోహన్ ముదిరాజ్, ముప్పవరపు గంగాధర్ రావు, మాధవరం గోపాల్ రావు, బి యస్ ఎన్ కిరణ్ యాదవ్, గొపరాజు శ్రీనివాస్,మహేందర్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మహ్మద్ కాజా, శ్రీధర్ ముదిరాజ్ , దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, చిన్న, ప్రభాకర్ ముదిరాజ్, నర్సింగ్ రావు, అశోక్ ,విజయ్ ముదిరాజ్, రాజు గౌడ్, ఎల్ రాజు,వెంకటేష్,శివ ముదిరాజ్, జంగం మల్లేష్, నాగరాజు యాదవ్, తిరుపతి నాయక్,కృష్ణ నాయక్,ఎస్టీ సెల్  అధ్యక్షులు స్వామి నాయక్,ప్రణీత్ కుమార్, సుధీర్ కుమార్, రవి,గౌస్, సత్యనారాయణ, మహిళ అధ్యక్షురాలు కలిదిండి రోజా, పి సుప్రజ, లత, రాణి, శ్రీ మహాదేవి, లక్ష్మి , స్థానికులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here