నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పర్యటించారు. లాక్‌డౌన్ పరిస్థితులను ఆరా తీశారు. ఆల్విన్ కాలనీ చౌరస్తా వద్ద వాహనదారులను సీపీ సజ్జనార్ స్వయంగా ఆపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరించి కేసులు రిజిస్టర్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలని, అవసరం ఐతే కానీ బయటకు రావద్దని సూచించారు. చిన్నపాటి అజాగ్రత్త జీవితాన్ని బలితీసుకునే పరిస్థితులు ఉన్నాయనే అంశాన్ని గుర్తించాలని అన్నారు. ఆయన వెంట డీసీపీ విజయ్‌కుమార్, సీఏఆర్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుమన్, ఎస్ఐలు, మియాపూర్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

