నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సేవా ఏ సంఘటన్ ఆద్వర్యంలో చేయూతనందించారు. పీడ్మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ (నార్త్ కరోలినా యూఎస్ఏ) సౌజన్యంతో బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు మూల జ్ఞానేంద్రప్రసాద్, బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ ఫేస్‌షీల్డ్‌లను ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్ వినయ్‌బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మొదటి దశ నుంచి ప్రభుత్వ వైద్య సిబ్బంది అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వారికి అందిస్తున్న సహకారానికి తోడు సిబ్బంది రక్షణ కోసం తమవంతుగా ఫేస్ షీల్డ్‌లను అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్యారామెడికల్ ఆఫీసర్ రమేష్ నాయక్, సిబ్బంది సంతోష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
