నమస్తే శేరిలింగంపల్లి: ఓ అపార్ట్ మెంట్ లో
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు సెక్స్ వర్కర్లను అరెస్టు చేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ యాదగిరి రావు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని ఆదర్శ నిలయం అపార్ట్ మెంట్స్ లోని 501 నంబర్ గల ఫ్లాట్ ను ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కిరాయికి తీసుకుని సెక్స్ వర్కర్లతో వ్యభిచారం చేేయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు సదరు గృహాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు మహబూబ్ నగర్ జిల్లా అనంతవరం మండలం అంబాగిరికి చెందిన వర్త్య బాలు (37), రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం చిలకమర్రికి చెందిన అంతరం కృష్ణయ్య(47)లతో పాటు ఇద్దరు సెక్స్ వర్కర్లను గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలించగా సదరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ యాదగిరి రావు తెలిపారు.