మియాపూర్ ఫర్నిచర్ మార్కెట్ ను తొలగించొద్దు: ఎంసీపీఐయూ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ప్రధాన రహదారి పక్కన గత పదేళ్ల నుండి ఫర్నీచర్ షాపులు పెట్టుకొని జీవిస్తున్న వారిని జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యంగా అక్కడి నుండి తరలించడం సరికాదని ఎంసీపీఐ యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారం నాయక్, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళీ అన్నారు. మియాపూర్ ఫర్నిచర్ షాప్ లను తరలిస్తున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇక్కడే షాపులు నిర్వహిస్తున్న వారితో పాటు సుమారు 100 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. గత రెండు రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సామాన్లను తరలించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మియాపూర్ వీధి వ్యాపారులకు కొండాపూర్ లో తరహా స్థలం కేటాయించి ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విమల, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఫర్నిచర్ దుకాణాలను తొలగించడాన్ని అడ్డుకుంటున్న ఎంసీపీఐ యూ నాయకులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here