నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగపురం కాలనీ బొల్లారం మెయిన్ రోడ్డు సమీపంలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో, బస్తీలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపై నిలవడం తదితర సమస్యలపై అప్రమత్తంగా ఉంటామన్నారు. ప్రతి కాలనీలలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ శ్రీకాంతిని, ఏఈ శివప్రసాద్, వాటర్ వర్క్స్ మేనేజర్ సాయిచరిత, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
