శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ మిత్ర హిల్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా కొండాపూర్ మసీద్ బండ భాజాపా కార్యాలయంలో మాజీ అధికార ప్రతినిధి బొల్లంపల్లి సీతారామరాజు ఆధ్వర్యంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మిత్ర హిల్స్ కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవతో పార్కు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయాలలో తమకు పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యలపై, మౌలిక సదుపాయాల విషయాలలో మిత్ర హిల్స్ కాలనీకి ఎల్లప్పుడూ అందుబాటులో అందుబాటులో ఉంటామని రవి కుమార్ యాదవ్ తెలియజేశారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ప్రశాంత్ , రమేష్, సూర్య , శ్రీనివాస్, వెంకట, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






