శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెరిచి ఉండగా తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలపాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందిని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీ లకు చట్టసభలలో, విద్యా, ఉద్యోగాలలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్ల గురించి తెలంగాణ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక సెలవు ఇప్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు , ఆంజమ్మ , రాజు ముదిరాజ్ , నాగపురి అశోక్ యాదవ్ , రమేష్ గౌడ్ , అజయ్ గౌడ్ , బాలమణి , మాధవి తదితరులు పాల్గొన్నారు.






