శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ త్రీ ఏ సైడ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ 2025 లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మిరియాల ప్రీతం పురుషుల వాలీబాల్ విజేత తెలంగాణ టీం కు కప్ అందజేశారు. మహిళల వాలీబాల్ విజేత మహారాష్ట్ర టీంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత రవికాంత్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ టీం కోచ్ వెంకట్ గౌడ్, వివిధ రాష్ట్రాల కోచ్‌లు, ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చందానగర్ లోని పి జె ఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.