శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో మున్సిపల్ కార్మికులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. TMEWA జోనల్ అధ్యక్షుడు ఏచూరి యాదయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కు అన్ని విధాలుగా ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగం అని కొనియాడారు. ఆయనకి ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారానే అన్ని హక్కులను సాధించుకోగలుగుతామని తెలియజేశారు. TMEWA నాయకులు నాగేశప్ప మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హక్కులను మనకు సాధించి పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కావలసిన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారని వాటి ద్వారానే ప్రతి చట్టసభలలో తమ వాటా తమకు చెందే విధంగా భారత రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. యూనియన్ నాయకులు BSN నాయక్, అచ్యుత్, బిక్షపతి, పరమేష్, మల్లయ్య, దేవేందర్, జితేందర్ పాల్గొన్నారు.