గోకుల్‌ప్లాట్స్‌లోని జూబ్లిహిల్స్ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 31తో ముగియనున్న అడ్మిషన్ల గడువు

నమస్తే శేరిలింగంపల్లి: గోకుల్‌ప్లాట్స్‌ వెంకటరమణ కాలనీలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల జూబ్లిహిల్స్ శాఖలో 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఈనెల 31తో ముగియనున్నట్టు ప్రిన్సిపాల్ బి.నాగస్వర్ణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదవ తరగతి లో 80 సీట్లు, అదే విధంగా 6, 7, 8 తరగతులలో మైనారిటీ బాలికలకు పరిమిత సంఖ్యలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఔత్సాహిక విద్యార్థులు వెబ్ సైట్ tmreis.telangana.gov.in లో లేదా నేరుగా పాఠశాలకు విచ్చేసి దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్ 9703296221, 7995057898 లలో సంప్రదించవచ్చని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని మైనారిటి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నాగస్వర్ణ పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here