నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎక్జిట్ డోర్‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన గాంధీ అక్కడ కోరానా జరుగుతున్న కరోనా పరీక్షలు, ఇతర వైద్యసేవల గురించి వైద్యాధికారి డాక్టర్ వినయ్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా రెండవ దశతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో చికిత్సవచ్చే రోగులు, కోవిడ్ టెస్టులు, వ్యాక్సినేషన్ కోసం వచ్చే ప్రజల సంఖ్య ఘననీయంగా పెరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నాయకుల సహకారం సైతం పొందుతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో హపీజ్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతంగౌడ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్జిట్ డోర్ ఏర్పాటు చేయించడం అభినందనీయమని అన్నారు. వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, అసిస్టెంట్ పారా మెడికల్ ఆఫీసర్ రమేష్ నాయక్, నాయకులు కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

