- తెరాస వార్తను ఖండించిన ఎంఐఎం యూత్ లీడర్ ఇమ్రాన్ అహ్మద్
హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట డివిజన్ పరిధిలో శుక్రవారం పలువురు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారని వస్తున్న వార్త అవాస్తవమని ఎంఐఎం పార్టీ యూత్ లీడర్ ఇమ్రాన్ అహ్మద్ అన్నారు. డివిజన్‌లో తెరాస కార్పొరేటర్ అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో డివిజన్‌లోని యూత్ కాలనీ, ఓల్డ్ హఫీజ్‌పేటలకు చెందిన ఎంఐఎం పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారని ఆ పార్టీ శుక్రవారం తెలిపింది. కాగా ఈ వార్తను ఇమ్రాన్ అహ్మద్ ఖండించారు. తమ పార్టీకి చెందిన ఎవరూ తెరాసలో చేరలేదని, అది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా సృష్టిస్తారని మండిపడ్డారు. ప్రజలు ఈ వార్తను నమ్మకూడదని, తమ పార్టీ అధిష్టానం సూచించే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.