- హాజరైన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ లు

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం గోపన్ పల్లి లో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్,ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, నాయకులు రవికుమార్ యాదవ్ లతో పాటు డివిజన్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పార్టీ అభ్యర్థులు ఎల్లేష్, గంగాధర్ రెడ్డి, రఘునాథ్ యాదవ్, నాయకులు మల్లేష్ యాదవ్, పెరిక సురేష్, కుమార్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

