మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే సదుద్దేశంతో ఐటీ కంపెనీలు ముందుకు వచ్చి మెగా జాబ్ మేళాను నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హైస్ ప్లేస్ మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళాను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ 50 ఐటీ కంపెనీలలో 5 వేల ఉద్యోగాలతో నిరుద్యోగులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. బుధవారం 50 నాన్ ఐటీ కంపెనీలు 5 వేల ఉద్యోగాల కోసం జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ‌ఈ అవకాశాన్ని ‌నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలిపించాలనే సదుద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు చక్కటి అవకాశం అన్నారు. అదేవిధంగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి కంపెనీల వివరాలు, రిక్రూట్ మెంట్ విధానం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

మెగా‌‌జాబ్ మేళాపై అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Hyse Placement Services Pvt Ltd సంస్థ ప్రతినిధి మనీష్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గాంధీ సౌజన్యంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని అన్నారు. 2015 లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 94 జాబ్ మేళాలు నిర్వహించామని వివరించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్పాన్సర్ షిప్ తో ఇక్కడి ప్రాంత నిరుద్యోగుల కోసం రెండు రోజుల పాటు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 11 న హోటల్ లెమన్ ట్రీ లొ బెస్ట్ HR అవార్డ్స్ ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డిగ్రీ, బిటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వారు అప్లయి చేసుకోవచ్చన్నారు. అనుభవం ఉన్న వారు, కొత్త వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం IT- 9652328448, 7675036820 Non IT- 9110344722, 7013068860, Website- hyseplacements.com లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ , కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, నాయకులు జంగం గౌడ్, కొండల్ రెడ్డి, బలరాం యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్ మేళాలో పాల్గొన్న వారితో మాట్లాడుతున్న ‌ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here