మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు అభినందనీయం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, రక్తదానంతో ఆపదలో‌ ఉన్న వారి ప్రాణాలను కాపాడినట్లు అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో 360 లైఫ్ నిర్మాణ రంగ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ, అపోలో హాస్పిటల్స్ సౌజన్యం తో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, మెగా హెల్త్ క్యాంప్ ను ఐఆర్ సీఎస్ చైర్మన్ అజయ్ మిశ్రా, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి , కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ‌గాంధీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంప్ వల్ల చుట్టు పక్కల పేద ప్రజలకు, సంస్థలో పనిచేసే కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తప్పనిసరిగా రక్తదానం చేయాలని, నిండు ప్రాణాలను కాపాడినవారవుతారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. రక్తదాన శిబిరం, మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాంచందర్, సత్యరెడ్డి, సాయి, లోకేష్, బ్రహ్మయ్య, మహేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మెగా హెల్త్ క్యాంపు లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here