ఆరోగ్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం – ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రస్తుత బిజీ జీవితాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో బెరాక చర్చి లో బెరాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ, షుగర్, గైనకాలజీ, ఆర్థో, ఈసీకీ, ఈఎన్ టీ, తదితర సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక దృక్పథంతో‌ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఏసుపాదం , లక్ష్మణ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీను, గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, అప్పారావు, సాంబయ్య, అనిల్ కావూరి, చంటి, మల్లారెడ్డి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

గోకుల్ ప్లాట్స్ లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here