నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ కాలనీలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సీ ఐ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఎఫ్ సీ ఐ కాలనీలో మౌళికవసతులు కల్పించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను తీరుస్తామన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, కాలనీ వాసులు సుప్రజ, ఉమకిషన్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.