నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మీదికుంట చెరువు సుందరీకరణ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులను సంరక్షించుకోవడమే గాకుండా చెరువులను సుందరీకరణ చేసి అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మీదికుంట కుంట చెరువు అభివృద్ధిలో భాగంగా చుట్టూ ఫెన్సింగ్, చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురికి నీటి కాలువ నిర్మాణం, అలుగు మరమ్మత్తులు చేపడుతున్నట్లు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. ఆయన వెంట స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు, సంబంధిత అధికారులు ఉన్నారు.