నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు డిమాండ్ చేశారు. కైటలాపూర్ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న దృష్ట్యా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారనే ముందస్తు సమాచారంతో తెల్లవారుజామున శేరిలింగంపల్లి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకులను చందానగర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, శ్రీహరి గౌడ్, శామ్యూల్, కార్తిక్, దుర్గ దాస్, సాయి కిషోర్ తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు.