శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్ చెరులోని సత్యసాయి సేవా సదన్ లో మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈ.సీ.జీ. నేత్ర, ఊపిరితిత్తులు తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ సునాయానాస్ (వైట్ అండ్ బ్రైట్ డెంటల్ క్లినిక్), డాక్టర్ గౌతమి (అగర్వాల్ ఐ హాస్పిటల్) తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సత్యసాయి సేవా సదన్ కమిటీ రామచంద్రమూర్తి, BRK రెడ్డి, రుద్ర రాజు, రాజగోపాల రావు, ఉదయ శంకర్, చంద్రమ్మ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, కాదా మొయినుద్దీన్, హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.






