శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): భవానిపురం కాలనీ, శంకర్ నగర్ కాలనీ , భవాని శంకర్ కాలనీ, NBR కాలనీ, వీరారెడ్డి కాలనీ, నారాయణ రెడ్డి కాలనీ, వెంకటరమణ కాలనీ సంబంధించిన కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు భవానిపురం కాలనీ సంక్షేమ సంఘంలో కలుసుకొని ఉమ్మడి సమస్యల గురించి చర్చించుకొని వాటిని ప్రజా ప్రతినిధుల దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్లాలని ఉమ్మడి ప్రణాళిక నిర్వహించారు. ముఖ్యంగా బందం కొమ్మ నుండి రోడ్డు అశోక్ నగర్ నుండి వచ్చే రోడ్డు ట్రాఫిక్ సమస్యల గురించి చర్చించుకున్నారు.






