నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ కు చెందిన మమత చికిత్స కోసం ఆస్పత్రిలో అయిన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.16 వేల చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మమత కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల వైద్య ఖర్చులకు ఆసరాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్, కావూరి అనిల్, వాసు తదితరులు పాల్గొన్నారు.