మెడికవర్ ఆస్పత్రిలో అడ్వాన్స్డ్ డయాబెటిక్ ఫుట్ కేర్ – పోడియాట్రిక్స్ యూనిట్ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: మెడికవర్ హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ అఫ్ వాస్క్యూలర్ అండ్ ఎండోవాస్క్యు లర్ పోడియాట్రిక్స్ (ఫుట్ కేర్) యూనిట్ ని హైటెక్ సిటీ అవుట్ పేషెంట్ బ్లాక్ లో ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ సి ఎస్ సి) జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ ఏదుల మాట్లాడుతూ పేషెంట్స్ కి నాణ్యమైన వైద్యం అందిచడంలో మెడికవర్ హాస్పిటల్స్ మొదటి నుంచి ముందు ఉంటుందన్నారు. ఎండోవాస్క్ లర్ అండ్ పోడియాట్రిక్స్ (ఫుట్ కేర్) కాళ్ల సమస్యలతో బాధపడుతున్న చాలా మందికి ప్రపంచస్థాయి అత్యాధునిక సేవలు అందించడమే లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది అని అన్నారు. ఎండోవాస్క్యూలర్ సర్జన్ అండ్ ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ చాలా మందికి డయాబెటిక్ ఫుట్ సమస్యలతో ఆర్థిక భారాన్ని కలిగిస్తాయన్నారు. మధుమేహం ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని, రాబోయే 10 నుండి 15 సంవత్సరాలలో 500 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటారన్నారు. మధుమేహం అనేది ఫుట్ పాథాలజీకి ప్రధాన కారణం, ఇది ఇస్కీమియా, ఇన్ఫెక్షన్ న్యూరోపతి నుండి పాదాల పుండ్లకు కారణమవుతుందని వెల్లడించారు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఏర్పడటానికి సంబంధించిన ప్రధాన ప్రమాద కారకాలు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD), డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, ఇవి ఒంటరిగా లేదా ఏకకాలంలో పనిచేస్తాయన్నారు. వాస్కులర్ అండ్ ఫుట్ కేర్ స్పెషలిస్ట్‌గా మా ప్రాథమిక లక్ష్యం అల్సర్‌ల అభివృద్ధిని నిరోధించడమని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఫుట్ కేర్ యూనిట్ అత్యాధునిక పరికరాలతో పేషెంట్స్ కు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంతో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, జనరల్ ఫీజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జగదీశ్, క్లస్టర్ హెడ్ దుర్గేష్ , చీఫ్ అఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ రాకేష్, సెంటర్ హెడ్ మాత ప్రసాద్ పాల్గొన్నారు.

మెడికవర్ ఆస్పత్రిలో డయాబెటిక్ ఫుట్ కేర్ – పోడియాట్రిక్స్ యూనిట్ ప్రారంభిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here