కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది: డీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ సురేష్ నాయక్

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు తీర్చాల్సిందిపోయి రైతుల పట్ల కపట ప్రేమ నాటకానికి తెరలేపాయని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నిరసన ర్యాలీలో సురేష్ నాయక్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను రోడ్డున పడేసే దుస్థితికి తీసుకువచ్చారని ఆవేదన చెందారు. ధర్నాలు ఆపి రైతు పండించి‌న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతు ర్యాలీ నిరసనలో కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సురేష్ నాయక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here