శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య చరిత్రలో అత్యంత అరుదైన, అసాధారణ కేసుకు తగిన చికిత్సనందించడం ద్వారా మెడికవర్ హాస్పిటల్ మరోమారు చరిత్ర సృష్టించింది.ఇన్‌ఫెక్షన్ కారణంగా చిన్నతనంలోనే పురుషాంగం కోల్పోయిన ఓ యువకునికి అతని ముంజేయి వద్ద పురుషాంగం అభివృద్ధి చేసి నూతన జీవితం ప్రసాదించారు. సోమాలియాకు చెందిన ఓ యువకుడు తన చిన్నతనంలో (4 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు) చేయించుకున్న సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురై తన పురుషాంగం పూర్తిగా కోల్పోయాడు. మూత్రవిసర్జన చేయాలన్న కూర్చొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు అతను పెళ్లి సంసారానికి సామాజికంగా ఎన్నో వేధింపులకు గురికావడంతో పాటుగా స్నేహితుల హేళనలతో తన పురుషాంగం సృష్టించుకోవడానికి ఎన్నో దేశాలలో ఎన్నో హాస్పిటల్స్‌కు తిరిగాడు. కానీ అవన్నీ నిష్పలమయ్యాయి.
చివరకు అతను హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చాడు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రోలజిస్ట్ డాక్టర్ రవికుమార్ తోపాటు ప్లాస్టిక్ సర్జన్ (Reconstructive & Cosmetic) డాక్టర్ దాసరి మధు వినయ్‌కుమార్ ని కలిశారు. రోగి పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన తరువాత పురుషాంగంతోపాటుగా వృషణాలను సైతం పునః సృష్టించాలని డాక్టర్లు నిర్ణయించారు. రోగి ముంజేయి వద్ద మైక్రో వాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్జెరీ ఫోర్‌ఆర్మ్ ఫ్లాప్ నుంచి పురుషాంగం పునః సృష్టించారు. ఈ శస్త్రచికిత్స చేయడానికి 10గంటలు పైగా సమయం పట్టిందని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఏ వీ రవికుమార్ అన్నారు. ఈ రోగి ఇప్పుడు సాధారణ పురుషుల్లాగానే మూత్రం పోయవచ్చు అని ఆయన తెలిపారు.
రోగి ముంజేయి దగ్గర నుంచి పురుషాంగం, సృష్టించడం జరిగిందని కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ అన్నారు. ఈ రోగి సర్జరీ జరిగిన మరో ఆరు నెలల నుంచి ఓ సంవత్సరం లోపు పురుషాంగం పరంగా పూర్తి స్పర్శను పొందాడు . స్పర్శ వచ్చిన తరువాత పినైల్ ఇంప్లాంట్ ని అమర్చారు . పినైల్ ఇంప్లాంట్ పెట్టినందువల్ల , అతను ఎలాంటి అనుమానం లేకుండా వివాహం చేసుకుని సంసారమూ చేయవచ్చు. అత్యంత అరుదైన కేసు అయినప్పటికీ సవాల్‌గా తీసుకుని ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాము’’ అని అన్నారు. సోమాలియాకు చెందిన 19 ఏళ్ల రోగి మాట్లాడుతూ ‘‘నా చిన్నతనంలో జరిగిన ఓ తప్పు వల్ల మానసికంగా ఎంతో క్షోభననుభవించాను. నేను ఆడ, మగ అనేది తేల్చుకోలేని స్థితి నుంచి ఇప్పుడు సంపూర్ణమైన పురుషునిగా స్వదేశానికి వెళ్తుండటం పట్ల సంతోషంగా ఉంది. మెడికవర్ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదములు తెలుపుతున్నాను. త్వరలోనే వివాహమూ చేసుకోబోతున్నాను’’ అని అన్నాడు.