శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కృష్ణ మాదిగకి తెలంగాణ రాష్ట్ర బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు, ఎస్సీ టీవీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశీ మోహన్ యాదవ్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. సామాజిక న్యాయమే తమ దారి అని అన్నారు. రాజ్యాంగ బద్దంగా అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పేదల వరకు చేరాలని అన్నారు. గత 30 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను అంగీకరించి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శక్తి వంశీ మోహన్ యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర కన్వీనర్ కృష్ణ గౌడ్, రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ జక్కుల నర్సింగ్ రావు, రాష్ట్ర ఎస్టీ కన్వీనర్ వెంకట్, మైనార్టీ కన్వీనర్ ఎండి కమర్ పాషా, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కన్వీనర్ రమేష్, రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ అశోక్, మేదరి సంఘం రాష్ట్ర కన్వీనర్ ముకుందం, బెస్త సంఘం రాష్ట్ర నాయకుడు అంజయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల జాతీయ అధ్యక్షుడు విజయభాస్కర్, బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.