ఖాజాగూడ బీఆర్ఎస్ కార్యాల‌యంలో రేపు మీడియా స‌మావేశం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మ‌ంగ‌ళ‌వారం (సెప్టెంబర్ 1, 2026) శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో ఉన్న ఖాజాగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫ‌ల పాల‌న‌పై బీఆర్ఎస్ నిర‌స‌న కార్య‌క్ర‌మాలను చేప‌డుతుంద‌ని, అందులో భాగంగానే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వివరించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ 1000 రోజుల వైఫ‌ల్యాల‌పై 10 రోజుల పాటు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఆ పార్టీ ప్ర‌జ‌ల‌ను ఏ విధంగా మోసం చేసిందో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నామ‌ని, ఈ స‌మావేశంలో పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here