తారానగర్‌లో వినాయకుడికి ప్రత్యేక పూజలు.. పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తారానగర్‌లోని బతుకమ్మ కుంట వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వినాయక మండపం నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో విద్యావారిధి వినాయక మండపం నిర్వాహకుడు ఎం. శివకుమార్, ఆయన బృందం సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here