గుల్మోహర్ పార్క్ కాలనీలో గణనాథుడికి ఘ‌నంగా ప్రత్యేక పూజలు.. పాల్గొన్న సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీలో కొలువుదీరిన గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది. కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాలనీ వాసులు ఐక్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలేష్, సంగారెడ్డి, మమత, రమేష్ గౌడ్, నారాయణ, జగదీశ్, సుదర్శన్, సంతోష్‌తో పాటు గుల్మోహర్ పార్క్ కాలనీ వాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హఫీజ్‌పేట్‌లో గణనాథునికి ఘనంగా ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ..

శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలో నిమ్మల రామకృష్ణ గౌడ్, సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమ్మల రామకృష్ణ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు సాయిబాబాను శాలువాతో ఘనంగా సత్కరించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సంగారెడ్డి, మమత, రమేష్ గౌడ్, నారాయణ, జగదీశ్, సుదర్శన్, సంతోష్‌తో పాటు పలువురు నాయకులు, కాలనీ వాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here