రాజీవ్ గృహకల్పలో 16 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ పరిశుభ్రత పనుల పరిశీలన

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్లలో వేలాది నిరుపేద కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన 16 లక్షల లీటర్ల సామర్థ్యం క‌లిగిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ (సంపు) పరిశుభ్రత పనులను శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. స్వయంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రత పనుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్పలోని పలు సమస్యలను స్థానిక వాసులు కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాగం నాగేందర్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, శ్రీకాంత్ దేవులపల్లి, చంద్రకళ, భాగ్యలక్ష్మి, సుజాత, సౌజన్య, జయలక్ష్మి, కుమారి, సుధారాణి, కళ్యాణి, గౌసియా, లక్ష్మి, మహేందర్, ఎల్లేష్, మహేందర్ సింగ్, మహేష్, నాందేవ్, వరప్రసాద్‌తోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here