శేరిలింగంపల్లి, మార్చి 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ముజఫర్ అహమ్మద్ నగర్ లో ఎంసిపిఐ (యు), ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఏ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి మధు సూదన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పార్టీ మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ షహీద్ భగత్ సింగ్ చిత్రపటానికి ప్రజా సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి 94వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎం సిపిఐ(యు) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి, నూనూగు మీసాల చిన్న వయసులోనే రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువతకు ప్రజలకు అందించి యువతను విప్లవ బాటలో పయనించాలని చెప్పిన మహానీయుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ డి డబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వి అనిత, ఏ ఐ ఎఫ్ డి వై నాయకులు యం డి సుల్తానా బేగం, డి శ్రీనివాసులు, మియాపూర్ డివిజన్ నాయకులు, డి నర్సింహా, యం డి రజియా బేగం, ఎ ఐ ఎఫ్ డి ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్, విద్యార్థి సంఘం నాయకులు హరి నాద్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.