నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములపై మియాపూర్ లో అనేక భూ పోరాటాలు చేసి నిలువ నీడ లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి అనేక బస్తీలు ఏర్పాటు చేసిన ఘనత ఎంసీపీఐయూ పార్టీకి, అమరజీవి తాండ్ర కుమార్ మాత్రమే దక్కిందని ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్ అన్నారు. మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో రతన్ నాయక్, యన్. గణేష్ అధ్యక్షతన ఎంసీపీఐయూ మియాపూర్ డివిజన్ 3వ మహాసభ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.తుకారాం నాయక్ జెండా ఆవిష్కరణ చేసి మహాసభను ప్రారంభించారు.
గత మహాసభ నుండి ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలు చేసి అమరులైన అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మియాపూర్ ప్రాంతంలో ప్రజల సమస్యల పై గత మూడున్నర దశాబ్దాలుగా ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, మురికి వాడలలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం మరిచి పెట్టుబడిదారులకు మాత్రమే కొమ్ము కాస్తూ పేదల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్తులో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత డివిజన్ మహాసభ నుండి నేటి వరకు కార్యక్రమాలు నివేదిక రూపంలో డివిజన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్ తెలియజేశారు. మహాసభ కార్యక్రమాల కోసం భవిష్యత్ రాజకీయ నిర్మాణం తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. అనంతరం సభ డివిజన్ స్థాయిలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో టి.అనిల్ కుమార్, పి భాగ్యమ్మ, పల్లె మురళి, ఏ.పుష్ప, యం.రాణి, విమల, లలిత, సుల్తానా, దార లక్ష్మి, సక్కు బాయి, డి.లక్ష్మి, కర్ర దానయ్య ఈ దశరత్ నాయక్, వై రాంబాబు, డి.నరసింహ, పి. శ్యాం సుందర్, డి. మధుసూదన్, రామచందర్, శంకర్, శరణప్ప, వెంకటాచారి, కే.రాజు, శ్రీనివాసులు, డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.